9 Jun 2014

అంతం

Posted by Oblivion in Poetry | 11:47pm


ఈ  కథే  మలుపు  తిరిగే 
నీ  వ్యధే  ఎవరి  కెరికే 

పయనమంతా  వ్యర్ధం 
నీవు  నడిచిన  బాటలో 
కలలన్నీ  నేడు  శూన్యం 
నీవు  ఎగిసిన  నింగిలో 

గతమా  ఇక  ఎక్కడిది 
నిన్ను  మరిచి  గాలిలో  కలిసింది 
గమ్యమా  మరి  లేనన్నది 
కురిసే  వాన  జల్లులో  తడిసింది 

ఉరుము  వినలేదా ?
మెరుపు  కనలేదా ?
ఇదే  సంకేతం !
ఇదే  అస్తమయం !
ఇదే  అంతం !

ఈ  కథే  మలుపు  తిరిగే 
ఈ  నిజం  చివరి  కెరికే 
 1