8 Jul 2014
ఎవరి కోసం?
ఎవరి కోసం ఆ మేఘం
దారి మళ్ళి ఈ చేను వెతికింది?
ఎవరి కోసం ఆ చినుకు
నింగి వదిలి నేలకు జారింది?
ఎవరి కోసం ఈ నెమలి
పురి విప్పి సిరిచిందులేసింది?
ఎవరూ లేరని ఇంకెవరూ రారని
నీ అడుగు పడగానే, అడగకనే
ఈ నేల గళమున
ఈ రాగం పలికింది
మరి విన్నావా, నీ గుండెతో
ఈ వాన పాట?
నీ బాట ఏదైనా
నీ రాత ఏమైనా
శబ్దంలో, నిశ్శబ్దంలో
నీ అడుగుల సవ్వడి
నీ పయనం కోసం
పాడే ఈ లాలిపాట!
Add Comment Trackbacks (0) Permalink