5 Feb 2015

గిట్లైతే ఎట్ల?

Posted by Oblivion in Poetry | 11:04pm


గిది తింటె విషమంటివి
గది తింటె జరమంటివి

గిది తాగితె క్యాన్సర్
గది తాగితె లివర్ ఖరాబ్

గీ పండు ముడ్తే పెస్టిసైడ్
గా ఫ్రిజ్ తాకితె కొవ్వు

జరంత గాలి పీలుస్తె కాలుశ్యం
చుక్క నీరు తాగితె ఫ్లోరైడ్

గది జబర్దస్త్ అని ఒకడు
గది మంచిది కాదని ఇంకోడు

గటు గుంజీ, గిటు గుంజీ
ఎదవను చేస్తరేంది?

తినాలంటే దడ, తాగాలంటే భయం
అరె, గిట్లైతే బతికేదెట్ల తమ్మీ?

 1