10 Jun 2015
నిశ్శబ్దం
అటు వైపులా
ఇటు వైపులా
ఎటు వైపులా
పలు వైపులా
నలు వైపులా
అన్ని వైపులా
కారుమబ్బులు కమ్మి
పగలో రాత్రో
నిజమో స్వప్నమో
మరణమో జననమో
తెలియని నిశ్శబ్దం
ఊబిలా మారితే
కప్పిన తెల్లటి వస్త్రం
మెల్లెగా లేపి
చివరి సారిగా
నీ ముఖం చూసి
నవ్వు మరిచిన నీ చెంపలు
చల్లగా తాకితే
రాలింది ఒక్కసారిగా
జీవితం
కన్నీటి చుక్కై!
Add Comment Trackbacks (0) Permalink