« Previous | Next»

9 Jan 2014

ఎవరన్నా పేద

Posted by Oblivion in Poetry | 6:40pm


హితులు కూడిన చెట్టు కింద
రేయిని తడిసిన నేల మీద
బాధ మరిచి, భయం లేక

అమ్మ మాటకు అవును అంటూ
బుజ్జిదాని నవ్వులోన
సరిగమల ఝరిని వింటూ

కొండ గాలి మేని తట్టగ
చుక్క చుక్క లెక్క కట్టి
పొద్దు మరలితె రవిని చూసే
నేనా!

పరుపు మీద, పాన్పు మీద
కునుకు లేక, సుఖము లేక
అందరున్నా ఎవరు లేక

చుక్క కానని చీకటిలో
భయం భయం గుండె చప్పుడు
చెవులు మూసినా చెవిని తట్టగ

నువ్వు నవ్వలేక, నవ్వూ పంచలేక
కలల తీరంపై ఒంటరివై
పొద్దుకోసం గుబులుతో వేచిచూసే
నువ్వా!

మరి చెప్పన్నా! ఓ అన్నా!
ఎవరు పేద? నువ్వా? నేనా?


 1 
Add comment
 authimage