Anveshi | General | 10 June 2008, 9:02am
నా పేరు కాకుమాని వెంకట మారుతి కీషోర్. ఏదో మాట వరసకి పెట్టారే తప్ప, ఆ పేరు తో ఎప్పుడు ఎవ్వరు పిలిచిన పాపాన పోలేదు... నాన్న ఏమో పనికిరాని వెధవా అని, అమ్మ ఏమో సిగ్గులేని గాడిద అని, పిలవడం అలవాటు. Friends మాత్రం కొంతలో కొంత న్యాయం చేకూరుస్తూ KVM అంటారు.
చెక్కర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు... నాకు తెలుగు అంటే ఇష్టం, తెలుగు మాట్లాడటం ఇష్టం, తెలుగు సంస్కృతి ఇష్టం, తెలుగు పలుకులు, తెలుగు పాటలు, తెలుగు అంటే నే బోలెడంత ఇష్టం... భావుకత, భాష పట్ల చక్కని అవగాహన ఉన్న స్నేహితులతో నా అంతరంగాన్ని పంచుకోవాలని ఎప్పటినుంచో పరితపిస్తున్నాను... ఈ Blog కూడా అందుకే.... వ్యక్తిగతంగా నేను Mechanical Engineering, MBA చదివి ఇప్పుడు ఏదో ఉద్యోగం చేసుకుంటూ అలా జీవితం గడిపేస్తున్నాను కానీ, అందులో సాహితీ సారస్వత సంపూర్ణత లోపించిందని మాత్రం వెలితిగా ఉంది.... నేను అడపా దడపా ఏవో పిచ్చి వ్రాతలు వ్రాసిన... వ్రాయడం తెలిసినా, నాకు ఎందుకో మంచి రచయితలు వ్రాసినవి చదవడం, విశ్లేషించడం, పరిశీలించడం అంటే చాలా ఇష్టం. కృష్ణ శాస్త్రి కవిత దగ్గర నుంచి, విశ్వనాథ్ సినిమాల వరకు భావుకతను ప్రతిబింబించే ఏ అంశం ఐనా, నాకు బోలెడంత ఇష్టం... ఇలా ఇష్టాల్ని నాలుగిరితో పంచుకోవాలన్న ఆకాంక్షే ఈ Blog...ఇక నా ప్రియమైన స్నేహితులందరికి నా మాట...
సమయం తో సమరం
నానాటి బ్రతుకు తో రణం
నడుమన
ఇది నవ్వు ల తోరణం.....
మీ అందరి నవ్వుల కోసం
ఒక చిన్న ప్రయత్నం....
ప్రస్తుతం Position చాలా Bad గా ఉంది.... Simpleగా చెప్పాలంటే ఏదో ఒక UKG lucky Stone వాడితె తప్ప బాగుపాడే Situation లేనంత Critical గా ఉంది... ఏంటా అని ఆలోచిస్తే చేసుకున్న పాపాల చిట్టా గుర్తొచ్చింది... చేసిన పాపం చెబితె పోతుంది అంటారు కానీ కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది, గొంతు చించుకుంటే గోడ అవతల పడుతుంది అన్న విషయం గుర్తువచ్చి, ఎందుకైనా ఈ చించుకోవడం అంత మంచి విషయం కాదు అని decide అయ్యాను.... ఈ మధ్య కాలంలో, స్నేహితులకు phone చేసి మాట్లాడటం అపురూపం ఐతే ... పోనీ కనీసం వాళ్ళు call చేసినప్పుడు మన mobile switch on చేసి ఉండడం అద్భుతం అయిపోయింది... అందుకనే కనీసం ఆ నలుగురు స్నేహితులతో నైనా నాలుగు నవ్వులు పంచేసుకొని పాపాలను కడిగేసుకుందాం అనే దురాశే ఈ పోలీకేక... అయితే ఇది నవ్వుల కోసం సాగించే ప్రహసనం వెనుక నిజమైన అందం ఆనందం ఏవిటో తెలుసుకోవాలన్న అన్వేషణ....
........................................................................కీషోర్......................................
Permalink | Add Comment | Trackbacks (0)